అనుకున్నది చేస్తున్న జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుకున్నది చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఎత్తి వేయడంతో ముందుగా అనుకున్న విధంగా ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయాలని సిద్దమైంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 27 లక్షల మందికి ఇళ్ళ పట్టాలని పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈ కార్యక్రమాన్ని ఉగాదికి బదులుగా ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు జగన్ పేర్కొన్నారు.

కరోనా నేపధ్యంలో ఇళ్ళ పట్టాల పంపిణి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ ఆదేశాలు జారీ చేసారు. లబ్ధిదారులు అందరికీ ఒకేసారి కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తలు తీసుకొని వారికి ఇళ్ల సైట్లను చూపించాలని తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జగన్ వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

కాగా ఇటీవల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ పట్టాలను పంపిణి చేయవద్దని ఎన్నికల కమీషన్ ఆదేశాలు ఇవ్వడంతో ఇళ్ళ పట్టాల పంపిణి ఆపేశారు. ఇక సుప్రీం కోర్ట్ ఎన్నికల కోడ్ సడలించాలి అని చెప్పిన నేపధ్య౦లో ఇళ్ళ పట్టాల పంపిణి కి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపధ్యంలో ప్రభుత్వం పంచడానికి సిద్దమైంది. దీనిపై లబ్ది దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news