కాపు ఉద్యమంలో నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హర్షం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. కాపు ఉద్యమంలో నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంపై ధన్యవాదాలు తెలిపారు. అన్యాయంగా పెట్టిన కేసులను దేవుడు మీ ద్వారా మోక్షం కలిగించారిన అన్నారు. మీకు స్వయంగా వచ్చి ధన్యవాదాలు తెలుపుతా అని లేఖలో పేర్కొన్నారు. మిమ్మల్ని కలవకపోవడం ఎప్పుడో చేసుకున్న పాపంగా ముద్రగడ అభివర్ణించారు. మిమ్మల్ని కలిస్తే..కాపు జాతిని అమ్మకానికి పెట్టి పదువులు పొందేందుకే అని విమర్శిస్తారని లేఖలో ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు కాపులను బీసీ – ఎఫ్ లో చేర్చినప్పుడు స్వయంగా కలిసి ధన్యవాదాలు చెప్పాల్సింది. అయితే జగన్, చంద్రబాబులు ఇద్దరిని స్వయంగా కలవలేని పరిస్థితి తనదని లేఖలో పేర్కొన్నారు.
గతంలో కాపు ఉద్యమం సమయంలో చెలరేగిన హింసపై పలువురిపై కేసులు నమోదయ్యాయి. తునిలో బహిరంగ సభను నిర్వహించిన సమయంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైల్ ను తగలబెట్టడంతో పాటు.. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్పై దాడులు చేశారు. ఈ ఘటనలతో గతంలో కాపు నేతలపై కేసులు నమోదయ్యాయి. తాజాగా వైసీపీ సర్కార్ ఎత్తేసింది.