ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కుల వ్యవహారంలో ఆరుగురు అరెస్ట్ !

-

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి నకిలీ చెక్కుల వ్యవహారంలో ఆరుగురు నిందితుల్ని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ ఏసీబీలోని అర్బన్ కరప్షన్ డిటెక్టివ్ ఫోర్సు సమాచారం మేరకు మంగళూరులో ఆరుగురు నిందితుల్ని దక్షిణ కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం రూ. 117 కోట్ల మేర నకిలీ చెక్కులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ నిధుల్ని కాజేసేందుకు ఈ ముఠా ప్రయత్నం చేసింది. నకిలీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు సృష్టించి ఢిల్లీ, కొల్ కతా, బెంగుళూరుల్లోని బ్యాంకు బ్రాంచీల ద్వారా నిధులు కాజేసేందుకు ప్రయత్నం చేసింది ఈ ముఠా.

బ్యాంకు అధికారుల అప్రమత్తం కావటంతో సెప్టెంబరు 21 తేదీన తూళ్లూరులో కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుండి ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న ఏసీబీలోని అర్బన్ కరెప్షన్ డిటెక్టివ్ ఫోర్సు ఈ నిందితులు ఎక్కడ ఉన్నారనే విషయాన్నీ పసిగట్టి దక్షిణ కర్ణాటక పోలీసులను అలెర్ట్ చేయడంతో వారు మంగళూరులో వారిని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news