మంత్రులను కుదురుగా ఉండనివ్వరా ? నిఘా భయం ఎక్కువయ్యిందే ?

-

ప్రతి విషయంలోనూ జగన్ పారదర్శకత కోరుకుంటారు. తాను తప్పు చేయట్లేదని, అలాగే తన సహచరులు ఎటువంటి తప్పులు లేకుండా, నిరంతరం ప్రజా పరిపాలనపైనే దృష్టి సారించాలని, ఎక్కడా అవినీతి వ్యవహారాల్లో తలదూర్చకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని, ఇలా అనేక రకాలుగా కోరుకుంటూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే పార్టీలో గాని, ప్రభుత్వంలో గానీ, ఎక్కడా ఎటువంటి అవినీతి వ్యవహారాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. జగన్ ఈ స్థాయిలో తాపత్రయపడుతున్నా, కొంత మంది పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మంత్రులు కొంత మంది అవినీతి వ్యవహారాల్లో నిరంతరం తలదూర్చుతూ, వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుండటం జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

ఇప్పటికే చాలాసార్లు పిలిచి వార్నింగ్ ఇచ్చినా, పరోక్షంగా హెచ్చరికలు చేసినా, కొంతమంది తమ పనితీరు మార్చుకోకపోవడం వంటి విషయాలు జగన్ కు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, ఎమ్మెల్యేలు ముఖ్యంగా మంత్రులు, అన్ని వ్యవహారాల పైన అత్యంత రహస్యంగా నిఘా ఏర్పాటు చేసినట్లుగా బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు ? ఏ ఏ వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు ? వివాదాలు ఏమిటి ?  ఆర్థిక లావాదేవీలు ఏంటి ? ఇలా అన్ని విషయాల పైన పూర్తిస్థాయిలో జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు తెచ్చుకుని వారికి గట్టి వార్నింగ్ లే ఇస్తున్నారట.

అసలు ఏ మూల ఏ చిన్న ఉపకారం చేసినా, జగన్ కు వెంటనే తెలిసిపోతుండడం, వార్నింగులు ఇచ్చేస్తూ ఉండటంతో, ఎవరికివారు ఆందోళన చెందుతున్నారట. ఇప్పటికే కొంతమంది మంత్రులు పనితీరుపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. పనితీరు సక్రమంగా లేని మంత్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, సస్పెన్షన్ చేసేందుకు కూడా వెనుకాడబోమని పదే పదే జగన్ చెబుతూ వచ్చేవారు. కానీ ఇప్పుడు కొంత మంది అవినీతి కార్యక్రమాల్లో తల దూర్చుతూ  వార్నింగ్ లు ఇస్తూ సరిపెడుతున్నారు. దీనికి కారణం మంత్రిమండలి మొత్తం సామాజిక వర్గాల సమతూకంగా ఉంది.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news