ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న జరిగిన కేబినెట్ భేటిలో హాట్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. 2024లో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టికొని మంత్రులకు దిశా నిర్దేశం చేసినట్టు సమాచారం. నియోజకవర్గాల వారిగా టార్గెట్స్ ఫిక్స్ చేశారంట. ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారట.
అలాగే.. ప్రభుత్వ పథకాలపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులకు జగన్ సూచించారట. నిత్యం ఏదో అంశంపై జనం మధ్య ఉండాలని , ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో రంగం సిద్దం చేసుకోవాలని తెలిపారట. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారంట.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి జగన్ కు సపోర్టు చేయనున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది నుంచి ఆయన టీమ్ ను రంగంలో దించనున్నట్టు సమాచారం. సీఎం జగన్ కూడా వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో జనంలోనే ఉంటానని చెప్పారంట. 2024 కంటె ముందు ఎన్నికలు జరిగిన ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సూచించారట