ఏపీ డీజీపీ సవాంగ్ .. జాగ్రత్తలు – పాటించకపోతే ఇంతే సంగతులు..!!

-

ఇండియాలో కరోనా వైరస్ విషయంలో దేశమంతటా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ఉత్తరాదిలో పంజాబ్ మరియు దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణలో పాజిటివ్ కేసులు బాగా నమోదవుతున్నాయి. అయితే అన్ని రాష్ట్రాలు ఎలా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వైరస్ ప్రజలకు సోకకుండా ఎక్కడికక్కడ కఠినమైన చర్యలు సర్కార్ తీసుకొని ప్రజలను అలర్ట్ చేస్తుంది. అయినా కానీ కొంతమంది ప్రజలు ఇష్టానుసారంగా రోడ్ల పైకి రావడంతో ఏపీ డీజీపీ జాగ్రత్తలు నియమాలు ప్రజలకు సూచించారు.Image result for ap dgp gautam sawang* కరొనా వైరస్ వ్యాప్తి, తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలి.

* ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుంది.

* ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలి.

* వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలి.

* సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలెవరూ రోడ్ల పైకి రావద్దు.

* ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి.

* భావి సమాజంకోసం పోలీసులు ఆంక్షల అమలులో ఖచ్చితంగా వ్యవహరిస్తారు.

* అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది.

* ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము.

* ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు..ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారు.

* సీజ్ చేసిన వాహనాలను వైరస్ తీవ్రత తగ్గిన తరువాత మాత్రమే రిలీజ్ చేస్తారు.

* ప్రైవేట్ వాహనాలను నిత్యావసర వస్తువులు/అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తారు.

ఈ నియమాలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే…మీ ఇంటిని, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని స్మశానాలు గా మార్చటం గ్యారెంటీ అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news