కరోనా వైరస్ ని ఏ విధంగా అయినా సరే కట్టడి చెయ్యాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది. ఎలా అయినా సరే కరోనా వైరస్ దేశంలో వ్యాపించకుండా చూడాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే నెల 30 వరకు దేశంలో లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా క్రమంగా విస్తరిస్తుంది. అన్ని దేశాల్లో కూడా కరోనా వ్యాప్తి అనేది అదుపులోకి వచ్చే పరిస్థితి దాటేసింది. మన దేశంలో మాత్రం కట్టడిగా ఉంది. దీన్ని ఇప్పుడే కట్టడి చేస్తే ఇబ్బంది ఉండకపోవచ్చు అనే భావనలో కేంద్రం ఉంది. అందుకే అవసరం అనుకుంటే అత్యవసర పరిస్థితిని ప్రకటించి దేశం మొత్తం అర్మీని దించే ప్రయత్నాలు చేస్తుంది. దీనిపై మోడీ అధికారిక ప్రకటన చేయనున్నారు.
ఎవరైనా ఉల్లంఘించినా సరే అవసరం అయితే హత్య కేసులు కూడా నమోదు చెయ్యాలని కేంద్రం భావిస్తుంది. మహమ్మారిని కట్టడి చెయ్యాలి అంటే కచ్చితంగా ఇప్పుడు కఠినం గానే ఉండాలని కేంద్రం భావిస్తుంది. అంతర్జాతీయ విమానాలను కూడా వచ్చే నెల 30 వరకు రద్దు చేసే యోచనలో మోడీ సర్కార్ ఉంది. ఎవరిని దేశం నుంచి బయటకు గాని దేశం లోపలికి రానీయవద్దు అని కేంద్రం నిర్ణయం తీసుకుంది.