ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

Join Our Community
follow manalokam on social media

ఏపీలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత ప్రచారానికి ఇవాళ్టితో తెరపడింది. ఎల్లుండి అంటే 9వ తేదీన పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల అధికారులు… ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇప్పటికే చాలా చోట్ల పనులు పూర్తయ్యాయి. మరోవైపు మూడోవిడత ఎన్నికలకు సంబంధించి, రెండోరోజు నామినేషన్లు కొనసాగుతున్నాయి.

రేపు,  ఎల్లుండి అనంతపురం, కపడ, చిత్తూరు జిల్లాల్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటించనున్నారు. రేపు ఎన్నికల ఏర్పాట్లు, ఎల్లుండి పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. ఇక ఏపీలో పంచాయతీ ఎన్నికల రగడ కొనసాగుతూనే ఉంది. అక్కడక్కడా చెదురుమొదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.ఇక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా లేక ఏమైనా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయా ? అనేది ఆసక్తికరంగా మారింది.

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...