అమరావతి : టెన్త్ ఫలితాలపై విధివిధానాలను ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ప్రకటించింది. పదవ తరగతి మార్కుల మూల్యాంకన విధానం కోసం ఏర్పడిన హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదించింది ఏపీ ప్రభుత్వం. ఈ సిఫార్సుల ప్రకారం 2020, 2021 సంవత్సరాలకు అమలు కానుంది మూల్యాంకన విధానం. అలాగే 2020, 2021 లకు వేర్వేరుగా మూల్యాంకన విధానం అమలు చేయనుంది ఏపీ సర్కార్.
ఇక ఇటు కరోనా వల్ల పరీక్షలు రద్దు అయినా మార్కులు, గ్రేడ్లు కేటాయించనుంది విద్యాశాఖ. 2019-20 పదవ తరగతి విద్యార్ధులకు సమ్మటివ్ అసెస్ మెంట్ -1 కి 50 శాతం వెయిటేజ్, మూడు ఫార్మాటివ్ అసెస్ మెంట్ లకు కలిపి 50 శాతం వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించింది విద్యాశాఖ. 2020-21 పదవ తరగతి విద్యార్ధులకు 70%, 30 % వెయిటేజ్ విధానం అమలు చేయనున్నట్లు పేర్కొంది. స్లిప్ టెస్టులకు 70 శాతం వెయిటేజ్, ఫార్మాటివ్ అసెస్ మెంట్ కు 30 శాతం వెయిటేజ్ సిఫార్సు చేసింది హై పవర్ కమిటీ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ.