రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టైన పోలవరంలోని ప్రధాన నిర్మాణం ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పటిష్ఠపరచడంతో పాటుగా ఎత్తును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం 42.5 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్ డ్యామ్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డ్యామ్ ఎత్తును మరో మీటరు మేర పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఫలితంగా ఎగువ కాఫర్ డ్యామ్ మొత్తం ఎత్తు 43.5 మీటర్లకు చేరుకోనుంది. ఎత్తును పెంచడంతో పాటుగా కాఫర్ డ్యామ్‌ను రెండు మీటర్ల వెడల్పున మట్టి, ఇసుకతో పటిష్ఠపరచాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇక ఎత్తు పెంపు, డ్యామ్ పటిష్ఠపరిచే పనులను శుక్రవారమే యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తింది. ఫలితంగా ఎగువ కాఫర్ డ్యామ్, స్పిల్ వే ఛానెల్ వద్ద 20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ఈ వరద శనివారంలోగా 28 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాఫర్ డ్యామ్‌కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేలా ఎత్తు పెంపు నిర్ణయాన్ని తీసుకున్న పనులను కూడా ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం.