అశోక్ గజపతిరాజు రిట్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను కొట్టివేసిన హైకోర్టు.. సింహాచలమ వారహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మానస ట్రస్ట్ కు అశోక్ గజపతి రాజు చైర్మన్ గా ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై ఏపీ సర్కార్ స్పందించింది. మానసాస్ ట్రస్ట్ అంశం హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాలు చేయడానికి సిద్దం అవుతోంది. హైకోర్టు తీర్పుపై మంత్రి స్పందించిన వెల్లంపల్లి శ్రీనివాస్… మానసాస్ ట్రస్ట్ అంశంపై కోర్టు తీర్పు కాపీ పూర్తిగా చూడలేదని.. దీనిపై అప్పీలుకు వెళతామని పేర్కొన్నారు.
మేము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని..తీర్పులు ఒక్కోసారి అనుకూలంగా వస్తాయి, ఒక్కోసారిగా వ్యతిరేకంగా వస్తాయని వెల్లడించారు. లోకేష్ చిన్నవాడూ కాదు.. పెద్దవాడు కాదని.. ట్వీట్ల బాబుగా తయారు అయ్యాడని చురకలు అంటించారు వెల్లంపల్లి శ్రీనివాస్. కాగా గతంలో మానస ట్రస్టీ, వారహలక్ష్మీ నరసింహ దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించిన ప్రభుత్వం