భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు..

అమరావతి : ఈ నెల 27 వ తేదీన రైతు సంఘాలు మరియు వామ పక్షాలు చేపట్టిన భారత్ బంద్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్ధతు పలికింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమాచార శాఖ మంత్రి వర్యులు పెర్ని నానీ కీలక ప్రకటన చేశారు. రైతు సంఘాలు మరియు వామ పక్షాలు చేపట్టిన భారత్ బంద్ కు ఏపీ సర్కార్ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు నాని.

రైతుల ప్రయోజనాలే ఏపీ సర్కార్ కు ప్రధానమని మంత్రి వర్యులు పెర్ని నానీ ప్రకటించారు. రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాల పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్‌ చేశారు. భారత్ బంద్ మద్దతుగా ఈనెల 26 వ తేదీ 27వ తారీకు సాయంత్రం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను నిలిపి వేస్తున్నట్లు పేర్ని నాని ప్రకటించారు. కాగా రైతు చట్టాలు మరియు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఎల్లుండి దేశవ్యాప్తంగా భారత్ బంద్ పాటిస్తున్నారు.