ఏపీలో ఇక బీసీ కుల గణన….ప్రభుత్వ కీలక నిర్ణయం

-

ఏపీ రాష్ట్రంలో బీసీ కుల గణనకు మార్గదర్శకాలు రూపొందించనుంది. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నేతృత్వంలో త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. బీహార్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే బీసీ గణన చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న బీసీ జనాభా లెక్కింపును మంత్రి చెల్లుబోయిన ఆధ్వర్యంలోని కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి, రాష్ట్రంలో బీసీ కుల గణనకు మార్గదర్శకాలు రూపొందించనుంది. భారతదేశ జనాభాలో ఓబీసీల జనాభా 52 శాతం కంటే అధికంగా ఉంది. అయితే కచ్చితమైన లెక్కలు తేలితే, జనాభా ప్రాతిపదికన బీసీ కులాల వారికి రిజర్వేషన్ ఫలాలు, నిధుల పరంగా మరింత మేలు జరుగుతుందని భావిస్తున్నారు. క, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ కమిటీ.. ఇప్పటికే బీసీ కుల గణనకు ముందుకొచ్చిన బిహార్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ సమర్పించిన నివేదిక అనంతరం రాష్ట్రంలో బీసీ కుల గణనకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేయనుంది.

AP govt decides to take census of BC castes

ఇదిలా ఉంటే.. ఇప్పటికే బీసీ కులానికి జాతీయ జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలం పెట్టాలని సీఎం జగన్ గతంలోనే కోరారు. దేశంలో 90 సంవత్సరాల క్రితం నాటి డేటా ఆధారంగానే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. దీంతో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నాయని ఆయా వర్గాలు చెబుతున్నాయి. కులాల లెక్కలతోనే బీసీల అసలు జనాభా తెలుస్తుందని భావిస్తున్నాయి. దేశంలో బీసీల జనాభా 70 కోట్లు అని.. మొత్తం జనాభాలో ఇది 56 శాతం అని పలు బీసీ సంఘాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కులగణన చేపట్టాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 12 సంవత్సరాలకు ఓ సారి దేశంలో జనాభాను లెక్కిస్తున్నా.. అందులో దళితులు, ఆదివాసీల సంఖ్యపై మాత్రమే స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే జనాభాలో ఓబీసీలతో పాటు ఏయే కులాల వారు ఎంత మంది ఉన్నారన్న సమగ్ర సమాచారం సేకరించడం లేదు. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు జగన్ సర్కార్‌ త్వరలోనే బీసీ కుల గణనకు శ్రీకారం చుట్టనుంది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news