ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయి.. కాకపోతే..?

-

కరొన కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. పరీక్షలు ఎప్పుడు పెడతారో, స్కూళ్ళు ఎప్పుడు తెరుస్తారో అర్ధం కానీ పరిస్థితులలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఈ నేపధ్యలో పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి  తెలిసిందే. అసెస్ మెంట్, ఇంటర్నల్స్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తామని టీఎస్ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ బాటలోనే తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి.

ఇకపోతే ఏపీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకోవచ్చని అందరూ భావించారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టమైన ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారం జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మంత్రి తెలిపారు. 11 పేపర్ల స్థానంలో 6 పేపర్లకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. అసత్య ప్రచారాలతో విద్యార్థులను గందరగోళానికి గురి చేయొద్దని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news