నిమ్మగడ్డకు మరో షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఉన్న కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం అయింది. అయితే ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ చెప్పిన పనులన్నీ చేయలేమని ఆయనకు షాక్ ఇచ్చింది. ఎన్నికల వ్యవహారానికి సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది, అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ మీద చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ప్రొసీడింగ్స్ వారి సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయాలని తొమ్మిది పేజీలతో కూడిన ప్రొసీడింగ్స్ ప్రభుత్వానికి పంపారు నిమ్మగడ్డ.

అయితే ఈ మొత్తం పరిశీలించిన తర్వాత ఆ ఉత్తర్వులను తిరిగి ఎస్ఈసీకి ప్రభుత్వం పంపింది. మీరు తీసుకుంటున్న ఈ చర్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, చట్టవ్యతిరేకంగా ఏక పక్ష ధోరణిలో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అధికారుల మీద చర్యలు తీసుకోవడం కానీ బదిలీ చేయడం గానీ చేయ లేమని, ఆ అధికారాలు ఎస్ ఈ సికి లేవని ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు కేంద్రానికి కూడా మరో లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news