ఎస్ఈసి తీరును సీరియస్ గా పరిగణిస్తున్న ఏపీ ప్రభుత్వం మరలా ఆయన మీద కోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. నిమ్మగడ్డ లక్ష్మణ రేఖను దాటారని భావిస్తున్న జగన్ సర్కార్ కోర్టుకు వెళ్లేందుకు సమాలోచనలు చేస్తున్నట్టు చెబుతున్నారు. నిమ్మగడ్డ తీరును తప్పుపడుతూ ముందు గవర్నర్ ను కలిసే యోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. అంతేకాదు ప్రజా ప్రతినిధుల విషయంలో ఎస్ఈసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేసే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు.
ఎస్ఈసి పరిధిని ఫిక్స్ చేసేందుకు కోర్టును ఆశ్రయించే యోచనలో సర్కార్ ఉందని అంటున్నారు. నిజానికి నిమ్మగడ్డ ప్రభుత్వం ఇచ్చిన పేపర్ ప్రకటనల విషయంలో సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఇలా తనను సంప్రదించకుండా ప్రకటనలు ఇవ్వడం సరికాదని ఇప్పటికే దీని బాధ్యులను వివరణ కోరారని ఆయన అన్నారు. ఇదే అంశం మీద సర్కార్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అన్ని విషయాల్లో ఆయన అలానే స్పందిస్తున్నారని సీరియస్ అయినట్టు తెలుస్తోంది.