సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలుకు సిద్ధమవుతోంది. ఏపీలో స్కూల్స్ కి ఎల్లుండి నుండి పది రోజులు పాటు సెలవులుగా ప్రకటించింది ప్రభుత్వం. ఆ తర్వాత 19వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. అయితే సెలవుల్లో తరగతులను కనుక నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని పాఠశాలల యజమాన్యాలకి జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలను జారీ చేయడం జరిగింది.
తాజాగా సెలవులు పై క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. జనవరి 9 నుండి 18 వరకు సంక్రాంతి సెలవలు ఇస్తున్నట్లు చెప్పింది. 13వ తేదీన రెండవ శనివారం, జనవరి 14 ఆదివారం, భోగి పండుగ. జనవరి 15 సోమవారం సంక్రాంతి పండుగ. 18 వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది. జనవరి 16 మంగళవారం వరకే సెలవులు ఉంటాయని భావించిన పాఠశాల కళాశాల యజమానులు మరో రెండు రోజులపాటు అదనంగా సెలవలు ప్రకటించాయి. తెలంగాణలో సంక్రాంతి సెలవులు తొమ్మిది నుండి 16వ తేదీ వరకు అని ప్రకటించారు. ఉద్యోగాల రీత్యా తెలంగాణలో ఉంటున్న వాళ్ళు ఇప్పటికే సొంతోళ్ళకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.