బిగ్ బ్రేకింగ్: సిబిఐకి ఏపీ హైకోర్ట్ షాక్

-

ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ ఇప్పుడు కొన్ని వ్యవహారాల మీద ఫోకస్ చేసింది. ముఖ్యంగా విశాఖ డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో సిబిఐ విచారణ చేస్తుంది. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుని కూడా సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. డాక్టర్ కేసు ఏపీ సర్కార్ ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ కేసులో పోలీసులతో పాటుగా రాజకీయ నాయకులది కూడా తప్పు ఉంది అనే విషయం విపక్షాలు పదే పదే చెప్తున్నాయి.

ap high court

ఇక దీని మీద సిబిఐ గత ఆరు నెలల నుంచి విచారణ చేస్తూనే ఉంది. కాని ఈ కేసులో తప్పు ఎవరిది ఏంటీ అనేది మాత్రం ఇంకా అసలు స్పష్టత లేదు. తాజాగా సిబిఐకి ఏపీ హైకోర్ట్ ఈ కేసు విషయంలో షాక్ ఇచ్చింది. విశాఖపట్నంకు చెందిన డాక్టర్ సుధాకర్ కేస్ పై ఏపీ హైకోర్ట్ లో విచారణ జరిగింది. సీబీఐ దాఖలు చేసిన నివేదికపై సంతృప్తి చెందని హైకోర్ట్… మరింత లోతైన విచారణ జరపాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది.

పర్యవేక్షణాధికారిగా అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని ఆదేశాలు ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా సీబీఐ తన నివేదిక అందించాలి అని స్పష్టం చేసింది. తదుపరి కేస్ విచారణ ఏప్రిల్ తొలివారానికి వాయిదా వేసింది. ఈ కేసులో కొంత మంది అధికార పార్టీ నేతలను కూడా విచారించే అవకాశం ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news