ట్విట్టర్‌ కు ఏపీ హైకోర్టు హెచ్చరిక.. మీ దుకాణం మూసుకోవాల్సి వస్తుంది !

-

న్యాయమూర్తులపై అనుచిత పోస్టులను పెట్టిన కేసు విచారణలో ట్విట్టరుపై హైకోర్టు సీరియస్ అయింది. భారతదేశంలోని చట్టాలు న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. ట్విట్టరుపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని అభిప్రాయపడింది ఏపీ హైకోర్టు… ట్విట్టర్ లో పోస్టులు డిలీట్ చేసినా విపిన్ అని టైప్ చేస్తే వెంటనే వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు హైకోర్టు న్యాయవాది అశ్విని కుమార్.

ట్విట్టర్ వద్ద ఉన్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల మెటీరియల్ను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని పేర్కొంది ధర్మాసనం. పోలీసులను పంపి స్వా ధీనం చేసుకునేలా ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది హైకోర్టు. న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన విదేశా ల్లో ఉన్న వారిని ఎప్పటిలోగా అరెస్టు చేస్తారని సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు… వచ్చే వారంలో కౌంటర్ వేయా లని ఆదేశాలు జారీ చేసింది. ఇక వచ్చే సోమవారానికి ఈ కేసు విచారణ వాయిదా వేసింది హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news