ఆనందయ్య మందు పంపిణీ చేయాలని దాఖలైన రెండు పిటిషన్ల విచారణకు అనుమతించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ నెల 27న హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేయనుంది. ప్రభుత్వం మందు పంపిణీ కి ఖర్చులు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్న పిటిషనర్లు… శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాలి అని హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. లోకాయుక్తా ఆదేశాల ప్రకారం మందు పంపిణీ అపారని పోలీసులు చెబుతున్నారని హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు.
లోకాయుక్తకి ఆ అధికారం లేదన్న పిటిషనర్… మందు పంపిణీ ఆపాలని అసలు లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదని కోర్ట్ కి వివరించారు. ఇక ఆనందయ్య మందు విషయంలో ఆయుష్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఏ విధమైన హానికారకాలు లేవు అని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్ లో కూడా పరిశోధనలు చేసారు.