బాబుకు దగ్గరగా: నిమ్మగడ్డ వింతకోరిక… షాకిచ్చిన హైకోర్టు!

-

కోర్టు తీర్పులు ఒక్కోసారి అనుకూలంగా రావొచ్చు, మరో సారి వ్యతిరేకంగా రావొచ్చు.. అంతమాత్రాన్న వాటిని ప్రశంసలనో, మొట్టికాయలనో భావించాల్సిన పనిలేదు! కాకపోతే ఒక వర్గం మీడియా ఈ పదజాలాలను ప్రయోగిస్తూ… కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే దాన్ని “మొట్టికాయలు”గా అభివర్ణించడం వల్ల ఈ పదప్రయోగం! ఇక విషయానికొస్తే… ఏపీ హైకోర్టు నిమ్మగడ్డకు షాకిచ్చింది!

అవును… ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్.. హైదరాబాద్ లోని తన ఇంటిని అధికారిక నివాసంగా భావించాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన ఏపీ హైకోర్టు ధర్మాసనం షాక్ అవుతూ.. అనంతరం నిమ్మగడ్డకు షాకిచ్చింది! ఏపీకి ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నప్పుడు.. హైదరాబాద్ లోని ఇంటిని అధికారికంగా భావించాలని కోరటం అర్ధం లేని ఆలోచన అని హైకోర్టు అభిప్రాయపడింది!

ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటున్నారు కదా.. ఆయనకు దగ్గర్లో, పార్క్ హయత్ కు మరింత దగ్గర్లో ఉండాలని భావించారో ఏమో కానీ.. కోర్టును ఆ విధంగా అడిగారు నిమ్మగడ్డ! అయితే… ఇది ఏమాత్రం సహేతుకమైన ఆలోచన కాదని మొదలుపెట్టిన ధర్మాసనం… “వ్యవస్థలే శాశ్వతం కానీ.. ఆయా హోదాల్లో ఉన్న వ్యక్తులు శాశ్వతం కాదు” అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సుచించింది!

మరి ఈ విషయాలపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి! హైకోర్టు వ్యాఖ్యలపై తగ్గుతారా లేక సుప్రీంకోర్టు వరకూ కూడా వెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది!

Read more RELATED
Recommended to you

Latest news