కాసేపటి క్రితమే ఏపీలో ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరాలకు సంబంధించి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలలో కొందరు ఎంతో కస్టపడి చదివినా ఒక్క సబ్జెక్టు లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేదా మార్కుల విషయంలో ఊహించనివి వచ్చి ఉండొచ్చు ఇలాంటి వాటికి రీ కౌటింగ్ , రీ వెరిఫికేషన్ లకు వచ్చే నెల 6వ తేదీ వరకు అపీల్ చేసుకునే అవకాశం ఉందని విద్యాశాఖ తెలిపింది. ఇక ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలు రాయడానికి పరీక్షలు మరియు ఫీజు కట్టాల్సిన వివరాలను కూడా విద్యాశాకహా విడుదల చేయడం విశేషం.
తప్పిపోయిన విద్యార్థులు రేపటి నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు ఫీజు కట్టవచ్చు. అదే విధంగా పరీక్షలు మే 24వ తేదీ నుండి జూన్ 1 వరకు జరుగుతాయని షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇక ప్రాక్టీకల్స్ పరీక్షలు జూన్ 5 నుండి 9 వరకు ఉంటాయని తెలిపింది.