ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను రేపటి నుంచి (14వ తేదీ) డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది. 16వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 7వ తేదీ వరకు కొనసాగునున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొదట జంబ్లింగ్ విధానంలో మార్చి 11 నుంచి 31వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
అయితే, పాత విధానాన్ని అకస్మాత్తుగా మార్చడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్న ఏపీ హైకోర్టు.. జంబ్లింగ్ విధానంలో కాకుండా పాత విధానంలోనే ఏ కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్ నిర్వహించుకొనేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ జారీ చేసింది. దీంతో పాత విధానంలోనే ప్రాక్టికల్స్ నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష తేదీలను సైతం విడుదల చేసింది.
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ – 2022
తేదీ పేపర్
మే 6 సెకండ్ లాంగ్వేజ్
మే 9 ఇంగ్లిష్
మే 11 మ్యాథ్స్ పేపర్–1A, బోటనీ, సివిక్స్
మే 13 మ్యాథ్స్–1B, జువాలజీ, హిస్టరీ
మే 16 ఫిజిక్స్, ఎకనావిుక్స్
మే 18 కెవిుస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మే 20 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (బైపీసీ విద్యార్థులకు)
మే 23 మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ
సెకండ్ ఈయర్ పరీక్షల షెడ్యూల్ – 2022
తేదీ పేపర్
మే 7 సెకండ్ లాంగ్వేజ్
మే 10 ఇంగ్లిష్
మే 12 మ్యాథ్స్ పేపర్–2A, బోటనీ, సివిక్స్
మే 14 మ్యాథ్స్–2B, జువాలజీ, హిస్టరీ
మే 17 ఫిజిక్స్, ఎకనావిుక్స్
మే 19 కెవిుస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మే 21 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (బైపీసీ విద్యార్థులకు)
మే 24 మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ