నిన్న హైదరాబాద్ లో ఈ రేసింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు వచ్చారు. ఇందులో భాగంగానే, ఏపీ తరఫున ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే, రెండు తెలుగు రాష్ట్రాల ఐటీ మంత్రులు అయిన కేటీఆర్, అమర్ నాద్ భేటీ అయ్యారు.
త్వరలో ఆంధ్రలోనూ ప్రపంచస్థాయి కార్ రేసింగ్ నిర్వహిస్తామని ఈ భేటీ అనంతరం అమర్ నాథ్ ప్రకటన చేశారు. ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది..అది పెట్ట కావడానికి టైం పడుతుందని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తెలుగు వారిగా హైదరాబాద్ అంతర్జాతీయ వేదికగా నిలవడం గర్వకారణం గా ఉందని తెలిపారు.
హైదరాబాద్ తెలంగాణ, ఏపి ప్రజలు కలిసి నిర్మించిన నగరమని వెల్లడించారు. హైదరాబాద్ తెలుగు ప్రజలందరిదన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది..అది పెట్ట కావడానికి టైం పడుతుందని వివరించారు. ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించే దిశగా ఏపిని అభివృద్ది చేస్తామని… వైజాగ్ ను హైదరాబాద్ మాదిరి క్యాపిటల్ గా డెవలప్ చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
తెలుగు రాష్ట్రాల ఐటీ మంత్రులు కేటీఆర్, అమర్ నాద్ భేటీ. త్వరలో ఆంధ్రలోనూ ప్రపంచస్థాయి కార్ రేసింగ్ నిర్వహిస్తామని అమర్ ప్రకటన. #AndhraPradesh #Visakhapatnam #Vizag pic.twitter.com/Wurp76T2Pf
— Vizag News Man (@VizagNewsman) February 11, 2023