ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మంత్రులు ఆళ్ల నాని, పేర్నినాని, నారాయణ స్వామి ముగ్గురూ భేటీ అయ్యారు. జంగారెడ్డి గూడెం మరణాలపై ముఖ్యమంత్రికి వివరించనున్నారు. ఈ అంశంపై ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ, మండలి చర్చల్లో కూడా రగడ నెలకొంది. ప్రతిపక్షం టీడీపీ దీనిపై చర్చించాలని గట్టిగా పట్టుబడుతోంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ కి పరిస్థితిని వివరించారు మంత్రులు.
టీడీపీ మాత్రం జంగారెడ్డి మరణాలను కల్తీ సారా మరణాలు అంటూ విమర్శలు గుప్పిస్తోంది. అసలు వాస్తవంగా అక్కడ ఏం జరిగిందని మంత్రులను ఆరా తీశారు సీఎం జగన్. మంత్రులు మాత్రం ఇది పోస్ట్ కోవిడ్ వల్ల, మరికొంత మందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉండటం వల్ల చనిపోయారని మంత్రులు సీఎంకు వెల్లడించినట్లు సమాచారం. ఈ సమావేశంలో టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందన్న జగన్… వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాాలని అన్నారని తెలుస్తోంది. ప్రతీ సంఘటనను రాజకీయం చేస్తోందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఈరోజు సభలో కూడా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.