“టెట్” నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

-

తెలంగాణలో త్వరలోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. అలాగే ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రతి యూనివర్సిటీ పరిధిలో ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం అసెంబ్లీలో విద్యాశాఖ పద్ధతి పై జరిగిన చర్చలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు.

బాసర ట్రిపుల్ ఐటీ లో ఉన్న సమస్య పై నివేదిక తెప్పించుకున్నా మని అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని ఆమె స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, మెడికల్ కాలేజీలు అలాగే నవోదయ స్కూల్ లో ఇచ్చిన కేంద్రం… తెలంగాణకు మాత్రమే ఏ ఒక్కటి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.” మన ఊరు మన బడి ” కింద ఎవరైనా స్కూల్ బాగు కోసం విరాళాలు ఇస్తే.. వారికి తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఫీజుల నియంత్రణ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆమె ప్రకటించారు. విద్యార్థుకు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news