తెలంగాణలో పదవ తరగతి పేపర్ల లీకేజీ వ్యవహారం పై స్పందించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని దేవుడు కూడా క్షమించడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయాలనుకోవడం దౌర్భాగ్యం అన్నారు మంత్రి బొత్స. ఆంధ్ర ప్రదేశ్ లో గతేడాది కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలలో పేపర్ లీక్ చేసిన 75 మందిపై చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఏడాది పటిష్టంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
ఇక మరోవైపు టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంతసేపు సీఎం జగన్ పై నిందలు, విమర్శలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కొద్దో గొప్పో టిడిపికి ఉన్న ఉనికి వచ్చే ఎన్నికలలో పోవడం ఖాయమని పేర్కొన్నారు.