షర్మిలకు ఏపీ సెగ.. లోటస్‌పాండ్‌ వద్ద ఉద్రిక్తత

-

హైదరాబాద్: వైఎస్ షర్మిలకు ఏపీ సెగ తగిలింది. ఏపీ, తెలంగాణ మధ్య వాటర్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల తెలంగాణకు అనుకూలంగా వ్యాఖ్యానించారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఉరుకోమని ఆమె అన్నారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వంతో ఎంతవరకైనా వెళ్తామని షర్మిల వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. లోటస్ పాండ్ షర్మిల పార్టీ ఆఫీస్ వద్ద ఏపీ పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. రాయలసీమ ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా షర్మిల మాట్లాడారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులపై షర్మిల వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. షర్మిల పార్టీ ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో సమితి సభ్యులను అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తమైంది. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై షర్మిల స్పందించాలని డిమాండ్ చేశారు. షర్మిల స్పందన చెప్పిన తర్వాతే తాము అక్కడి నుంచి కదులుతామని బీష్మించారు. దీంతో రంగంలోకి పోలీసులు దిగారు. పరిరక్షణ సమితి సభ్యులను చెదరగొట్టారు.

 

మరోవైపు వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జులై 8న కొత్త పార్టీ ప్రకటించబోతున్నారు. ఇందుక సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలకు ఇలాంటి పరిణామాలు ఎదురవడం, ఆమెకు రెండు వైపుల నుంచి సవాళ్లు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news