ఉద్యోగులు ఎవరి ప్రోద్బలంతోనో, భావోద్వేగంతోనో కాకుండా సంయమనంతో ఆలోచించాలని కోరుకుంటున్నాం అని మంత్రి పేర్ని నాని కోరారు. ఉద్యోగుల పట్ల సానుభూతి ఉండటం వల్లే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 27 శాతం ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించారని ఆయన అన్నారు. మంచి మనసుతో ఆలోచించాలని ఉద్యోగులను కోరుతున్నానని ఆయన అన్నారు. ఉద్యోగులను కన్నబిడ్డల్లా చూసుకోవాలనే సీఎం తాపత్రయం అని..కన్నబిడ్డల కోరికలు తీర్చలేని పరిస్థితిలో కన్నతల్లి దండ్రులు పడే ఆవేదన సీఎం పడుతున్నారు మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఉద్యోగులను మంత్రి కోరారు. ఆశించిన మేర పీఆర్సీ ఇవ్వకపోవడం బాధాకరమే అని ఆయన అన్నారు. కొత్త పీఆర్సీ వల్ల రాష్ట్రంపై రూ. 10247 కోట్ల భారం పడుతుందని ఆయన తెలిపారు. ఎవరో చెప్పిన మాటలు విని ఉద్యోగులు సమ్మెకు వెళ్లవద్దని ఆయన కోరారు. యూనియన్ నేతలు ఉద్యోగుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలు ఉద్యోగులను రెచ్చగొడుతున్నాయన్నారు. వీరు అధికారంలో ఉన్నప్పడు.. ఉద్యోగులను కష్టపెట్టినట్లు ఎవరూ కష్టపెట్టలేదని ఆయన తెలిపారు.
ఉద్యోగులను కన్నబిడ్డల్లా చూసుకోవాలనే సీఎం తాపత్రయం- పేర్ని నాని
-