విద్యార్థులకు శుభవార్త.. పీజీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

-

పీజీ చదువాలనుకునే అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోస్టు గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీపీజీసెట్‌-2022) షెడ్యూలను విడుదల చేసింది. యోగి వేమన యూనివర్సిటీ వీసీ, పీజీసెట్‌ చైర్‌పర్సన్‌ సూర్య కళావతి.. పీజీసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వై. నజీర్‌ అహమ్మద్‌తో కలిసి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అనంతరం వీసీ సూర్య కళావతి మాట్లాడుతూ.. ఒక సబ్జెక్టుకు ఒకే అప్లికేషన్‌, ఒకే ఫీజు అమలు చేశామన్నారు. ఏపీపీజీసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వై.నజీర్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 16 వర్సిటీలు, అనుబంధ పీజీ కళాశాలలు, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, మైనార్టీ కళాశాలల్లో ఉన్న 147 కోర్సులకు ఒకే నోటిఫికేషన్‌ ద్వారా సీట్ల భర్తీ ఉంటుందని వెల్లడించారు. 2022-23 విద్యాసంవత్సరానికి పీజీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.

AP PGECET 2022: Application Form (Soon), Result, Dates, Syllabus, Pattern

అన్ని వర్సిటీలకు కలిపి ఒకే అప్లికేషన్‌ ద్వారా పీజీలో చేరే అవకాశం కల్పించామమని, పీజీసెట్‌ను 3 కేటగిరీలుగా విభజించామని, వీటిలో ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్స్‌, కామర్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, సైన్స్‌ ఉంటాయని ఆయన వెల్లడించారు. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు, పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు, డిగ్రీ చివరి సెమిస్టర్‌లో ఉన్న వారు పీజీసెట్‌ రాసేందుకు అర్హులని తెలిపారు వై.నజీర్‌ అహమ్మద్‌ . ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు జూలై 20వ తేదీ ఆఖరని, రూ.500 అపరాధ రుసుముతో జూలై 27వ తేదీ వరకు, రూ.వెయ్యి అపరాధ రుసుముతో జూలై 29 వరకు అవకాశం ఉంటుందని తెలిపారు వై.నజీర్‌ అహమ్మద్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news