హెచ్ఆర్ఏ కోసం పట్టుబడుతున్న ఉద్యోగ సంఘాలు… మంత్రుల నివేదిక తిరస్కరణ

-

పీఆర్సీపై ఉద్యోగసంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు చేస్తోంది. అయితే హెచ్ఆర్ఏ విషయంలో మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. మంత్రుల కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు హెచ్ఆర్ఏ స్లాబులను పీఆర్సీ సాధన సమితి మంత్రుల ముందు ఉంచింది. హెచ్ఆర్ఏ స్లాబులు 12 శాతంతో మొదలవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపాదించారు. ఈస్థాయిలో హెచ్ఆర్ఏ కష్టమని మంత్రులు ఉద్యోగులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

10, 12, 16 శాతాల మేర హెచ్చార్ఏ స్లాబులని ఫిక్స్ చేయాలని పీఆర్సీ సాధన సమితి ప్రభుత్వాన్ని కోరుతోంది. సెక్రటేరీయేట్, హెచ్వోడీ కార్యలయాల్లో పని చేసే ఉద్యోగులకు 24 శాతం హెచ్చార్ఏ ఇవ్వాలని ప్రతిపాదించారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. ఉద్యోగ సంఘాలు ఇచ్చిన హెచ్ఆర్ఏ ప్రతిపాదనలపై మంత్రుల కమిటీ చర్చిస్తోంది. ఈరోజు ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఉదయం మంత్రుల కమిటీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి వివరించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news