గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు నెల ఆఖరుకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఏపీలో నెలకొంది. అయితే.. ఇలాంటి తరుణంలో ఆదాయం విషయంలో ఏపీకి భారీ ఊరట లభించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కాలంతో పోలిస్తే.. ప్రస్తుత ఐదు నెలల కాలానికి గణనీయంగా ఏపీ ఆదాయం పెరిగింది.
తొలి ఐదు నెలల కాలంలో గతేడాది కంటే రూ. 15,688 కోట్ల మేర అధిక ఆదాయం వచ్చింది. గతేడాది తొలి ఐదు నెలల కాలంలో రూ. 37,470.65 కోట్లు అయితే.. ఈ ఏడాది అదే కాలానికి రూ. 53,159.11 కోట్ల మేర ఆదాయం వచ్చింది.
పన్నుల ద్వారా సుమారు రూ. 12 వేల కోట్లు.. కేంద్ర గ్రాంట్ల ద్వారా రూ. 3213 కోట్ల మేర అధిక ఆదాయం లభించింది. మద్యంపై ఏఈఆర్టీ ఛార్జీలు, స్థానిక సంస్థల్లో యూజర్ ఛార్జీలు, పెట్రో సెస్, రోడ్ సెస్ వంటి వాటి ద్వారా ఏపీకి ఆదాయం పెరిగింది. అయితే… ఆదాయం తో పాటు.. అదే స్థాయిలో ఏపీ ప్రభుత్వానికి ఖర్చులు కూడా పెరిగాయి. సంక్షేమ పథకాల అమలుతో ఈ పరిస్తితి నెలకొంది.