ఇవాళ అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఇతర కీలక నేతలు అందరూ హాజరయ్యారు.
అయితే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎందుకు తాను వస్తానని… పార్టీ నేతలకు చెప్పారు. 26వ తేదీ లేదా 27 తేదీలో హుజూరాబాద్ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.
విపక్ష పార్టీలు దిమ్మతిరిగేలా ఈ సమావేశం నిర్వహించాలని పేర్కొన్నాడు సీఎం కేసీఆర్. కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30వ తేదీన జరగనుండగా… నవంబర్ 2వ తేదీన ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున గెల్లు శ్రీను, బీజేపీ తరఫున ఈటల రాజేందర్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.