పీఆర్సీ సాధన సమితి ఎప్పుడు చెబితే అప్పుడు సమ్మె చేసి బస్సులను ఆపేస్తామని ఎన్ఎంయూఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రావు హెచ్చరించారు. ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలతో ఆర్టీసీ ఉద్యోగులకూ నష్టమేనని… పీఆర్సీ సాధన సమితి సూచనల మేరకు సమ్మెలోకి వెళ్లడానికి సిద్దమని స్పష్టం చేశారు. వచ్చే నెల మూడో తేదీన ఛలో విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొంటారని పేర్కొన్నారు.
ప్రభుత్వ రివర్స్ పీఆర్సీ వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు మరింత నష్టమని వెల్లడించారు. ఆర్టీసీకి విలీనం కాకముందే మాకు నాలుగేళ్లకోసారి పీఆర్సీ వచ్చేది.. ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జీవో వల్ల పదేళ్లకోసారి పీఆర్సీ వచ్చే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే.. విలీనం ఎందుకు కోరుకున్నామా అని బాధపడుతోన్నామని ఎన్ఎంయూఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రావు తెలిపారు..