ఏపీ రాజకీయాలను జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లగల సమర్థులు నాని.అందులో డౌటే లేదు. ఆయనకు లోకేశ్ కు పడదు. అందుకే చినబాబును ఆయన నోటికి వచ్చిన విధంగా తిడతారు అని అంటారు పసుపు పార్టీ వర్గీయులు. మంత్రినాని అంటే ఎన్టీఆర్ కు వీరాభిమాని.. మంత్రి నాని అంటే ఓ సామాన్య స్థితి నుంచి మాన్య శ్రీ అని అనిపించుకోదగ్గ స్థాయికి వెళ్లిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే అత్యంత అదృష్టవంతుడు. జగన్ దగ్గర ఎవ్వరికీ అంతటి స్నేహం లేదు. కానీ ఆయనంటే జగన్ కు వల్లమాలిన ప్రేమ మరియు అభిమానం కూడా! అని అంటుంటారు కొందరు.
ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ జగన్ వెంటే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే జగన్ చెప్పిన విధంగానే టీడీపీని టార్గెట్ చేస్తూ తనదైన స్వామి భక్తి ప్రకటనలో ఆయన ముందుంటూ అందరినీ ముందుండి నడిపిస్తున్నారు. విమర్శకులను పట్టించుకోని ఏకైక మంత్రి నాని అని చెప్పడం అతిశయం కాదు కానీ ఇదే అసలు విషయం. ఆయన ఏం చెప్పినా ఇవాళ క్యాబినెట్ లో తిరుగుండదు. అంతటి అసమాన తేజం, రాజసం, అధికారం ఆయనకే సొంతం.
మంత్రి కొడాలి నాని పేరు చెబితే వివాదాలే గుర్తుకు వస్తాయి. మంత్రి నాని పేరు చెబితే బూతులే గుర్తుకు వస్తాయి. మంత్రి నాని అంటే ఎవ్వరో కాదు ఒకప్పుడు హరికృష్ణకు చేరువ. ఆయన అనుచరుడు. మంత్రి నాని అంటే ఎవరో కాదు సాంబ సినిమా నిర్మాత. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత ఆప్తుడు. మంత్రి నాని అంటే ఎవరో కాదు టెన్త్ వరకూ మాత్రమే చదువుకున్న ఏకైక ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఆయనే!
మంత్రి నాని అంటే ఎవ్వరో కాదు ఇప్పుడున్న తారక్ ను దగ్గరుండి చదువు చెప్పించిన స్నేహితుడు. ఆ రోజు తారక్ అల్లరిని అంతా గుంటూరు కేంద్రంగా భరించిన వాడు కూడా! ఇప్పుడు అనూహ్యంగా ఆయన మంత్రి అయ్యారు. రేపో మాపో తప్పించినా కూడా తన ఛార్మింగ్ కు తిరుగులేదని చెప్పగలిగే సమర్థులు ఆయన.
టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు కొడాలి నాని. 2012లో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు నాని. అంటే దాదాపు పదేళ్లు వైసీపీలోనే ఉన్నారు. అప్పటి నుంచి జగన్ కు భక్తుడిగా ఉన్నారు. జగన్ ఇలాకాలో 2014, 2019లో వరసు ఎమ్మెల్యే అయ్యారు.2004,2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచాక, అదే గుడివాడ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యం పొందారు. 2012లో ఆయన అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి చంద్రబాబును అదే పనిగా తిడుతుతున్నారు.
ముఖ్యంగా ఏపీ క్యాబినెట్ లో బూతుల మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కొందరు కొడాలి నాని కాదు ఆయన క్యాసినో నాని అంటూ హేళన చేస్తున్నారు కూడా! విమర్శలు ఏ స్థాయిలో ఉన్నా ఒకప్పటి లారీ మెకానిక్ మరియు డ్రైవర్ ఇప్పుడు మంత్రిగా ఓ వెలుగు వెలగడమే ఓ పెద్ద విషయం. సామాన్య విషయం అయితే కాదు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయనకు ఉన్న పేరు మరియు అధికారం కారణంగా ఎక్కడెక్కిడికో ప్రభుత్వం అందించే కోటా బియ్యం తరలిపోయినా కూడా ఆయనను అడ్డుకునే వారు లేరు.అడిగే వారు లేరు.