విటమిన్ డి లోపం వలన క్యాన్సర్ వస్తుందా..?

-

మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. అలాగే అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. మనకి కావాల్సిన పోషక పదార్థాలలో విటమిన్ డి కూడా ఒకటి. విటమిన్ డి ని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు రాకుండా ఉండొచ్చు. విటమిన్ డి అనేది అవసరమైన విటమిన్. ఇది కాల్షియం ని అబ్సర్బ్ చేసుకుంటుంది.

అయితే విటమిన్ డి లోపం ఉంటే ఎముకల నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఫ్రాక్చర్స్, మూడ్ చేంజెస్ లాంటి సమస్యలు వస్తాయి. అయితే విటమిన్ డి లోపం ఉంటే క్యాన్సర్ వస్తుందా..? అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే చూసేద్దాం. ఓవరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కొలెన్ కాన్సర్ వంటి క్యాన్సర్లు విటమిన్ డి లోపం వల్ల కలిగే ప్రమాదం. అయితే విటమిన్ డి ని నాచురల్ గా తీసుకోవడం మరియు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం లేకుండా ఉండొచ్చు.

విటమిన్ డి మనకి చేప, గుడ్లు, డ్రైఫ్రూట్స్ వంటి వాటిలో దొరుకుతుంది అలానే సూర్యుడు వేడి తగిలేటట్టు ఉంటే కూడా విటమిన్-డి మనకి లభిస్తుంది. ఇలా మనం విటమిన్-డి లోపం లేకుండా ఉండొచ్చు. విటమిన్-డి ఎక్కువగా పాలు, సోయా, మిల్క్, చేప, గుడ్లు, బ్రోకలీ, మష్రూమ్, అవకాడో, బొప్పాయి వంటి వాటిలో కూడా దొరుకుతుంది. ఇలా ఈ ఆహార పదార్థాలు తీసుకొని విటమిన్-డి లోపం లేకుండా ఉండండి. లేదంటే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news