AP: టికెట్ రేట్లపై కమిటీ చేసిన సిఫారసులు ఇవే..!

-

ఏపీలో గత రెండు నెలల నుంచి వివాదాస్పదం అవుతున్న థియేటర్ల టికెట్ రేట్ల వివాదం రేపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రేపు టికెట్ రేట్లపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం కాబోతోంది. కమిటీ ప్రతిపాదించిన సిఫారసులను ప్రభుత్వానికి అందించనుంది. ప్రభుత్వ సిఫారసులను పరిశీలించి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పికే డ్రాఫ్ట్ రికమెండేషన్లు సిద్ధం అయ్యాయి. రేపటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

భౌగోళిక క్యాటగిరీలో జీవో 35 ప్రకారం నాలుగు ప్రాంతాలను, మూడు ప్రాంతాలుగా కమిటీ సిఫారసు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ, నగర పంచాయతీలను కలిపి నగర పంచాయతీ ఏరియాగా సిఫార్సు చేసినట్లు సమాచారం. మున్సిపల్ కార్పోరేషణ్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఈ మూడు కెటగిరీలను సూచించారని తెలుస్తోంది. టికెట్ క్లాసుల్లోనూ సవరణకు సూచనలు కూడా చేశారని తెలుస్తోంది. ఇప్పుడున్న మూడు క్లాసులను ఇక రెండే క్లాసులుగా ఉండే అవకాశం ఉంది. గతంలో డీలెక్స్ కేటగిరీలు, ఎకానమీ, ప్రీమియం క్యాటగిరీలు ఉండేవి.. అయితే డీలెక్స్ కెటగిరీని తీసివేసి కేవలం రెండే కేటగిరీలుగా అన్ని థియేటర్లలోనూ.. ప్రీమియం, ఎకానమీ రెండే క్లాసులు ఉండే అవకాశం ఉంది. 40 శాతం సీట్లు ఎకానమీ కాగా.. మిగిలినవి ప్రీమియం క్లాసులోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news