ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న అల్పపీడననముగా ఆగ్నేయ బంగాళా ఖాతం దాని సరిహద్దునున్న నిన్న ఆను కొనిఉన్ననైరుతి బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైఉండి ఈరోజు పశ్చిమ మధ్య మరియు దానిని ఆను కొనిఉన్ననైరుతి బంగాళా ఖాతం వద్ద నున్న దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ -ఉత్తర తమిళనాడు తీరము దగ్గరలో తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది.  అదేప్రాంతములో ఈరోజు అనగా 18 వ తారీకు ఉదయం 08 .30 గంటలకు వాయుగుండముగా మారి 11 .0 ఉత్తర అక్షాంశం మరియు 82 .౩ తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉన్నది.

ఈ వాయుగుండము చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు దూరములో , పుడుచెర్రికి తూర్ప ఆగ్నేయంగా 290 కిలోమీటర్లు దూరములో మరియు కారైకాల్కు తూర్పు ఈశాన్యముగా 270 కిలోమీటర్లు దూరములో కేంద్రీకృతమై ఉన్నది . ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి , దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ -ఉత్తర తమిళనాడు తీరము వద్ద సుమారు నవంబర్ 19 , 2021 వ తేదీ ఉదయమునకు చెన్నైకి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా.. రాయలసీమ, కోస్తాంద్ర లో భారీ వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేసింది.