బీజేపీ, టీఆర్ఎస్ ధర్నాలు ఓడ్రామా…జాగో తెలంగాణ- ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

-

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ ధాన్యం కొనుగోలు మద్దతు ధర్నాలపై వివిధ పార్టీ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ ధర్నాలను వీధి నాటకాలుగా అభివర్ణించింది. తాజాగా మాజీ ఐపీఎస్ డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ధర్నాలపై విమర్శలు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు చేసే ధర్నాలు ఓ డ్రామాగా అభివర్ణించారు. హుజూరాబాద్లో బహుజన ఈటెల రాజేందర్ ఓడిపోవాలని అనేక కుట్రలు చేసి ఘోర పరాజయం చవి చూసి అతని విజయాన్ని తట్టుకోలేక కేంద్రమే ధాన్యాన్ని కోనుగోలు చేయాలని.. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ధర్నాలు చేయడం ఓ రాజకీయ డ్రామా అన్నారు. ఈటెల రాజేందర్ విజయాన్ని బీజేపీ విజయం కాన్నట్లు ట్విట్లర్ లో పోస్ట్ పెట్టారు. కార్పోరేట్ శక్తులు పన్నిన వలలో అన్నదాతను ఇరికించే ఘోరమైన కుట్రగా అభివర్ణించారు. జాగో తెలంగాణ అంటూ ట్విట్ చేశారు.

2016లో ఇందిరాపార్క్​ ధర్నాచౌక్ ఎత్తివేసి, ప్రశ్నించే గొంతుకలను అణిచివేసి, రైతులకు బేడీలు వేసిన కేసీఆర్, నేడు ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదే చౌక్ వద్ద ధర్నా చేయడం ఓ వింత అని. మరో పదేళ్లూ ప్రగతి భవన్ లోనే తిష్టవేసి కుటుంబపాలన సాగించాలన్న పన్నాగం అని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news