టికెట్ రేట్లపై తగ్గేది లేదంటున్న ఏపీ… డివిజన్ బేంచ్ లో అప్పీల్ చేయనున్న ప్రభుత్వం..

-

ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లపై తగ్గేదే లేదు అంటుంది. నిన్న హై కోర్ట్ ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 35ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సామాన్యుడి ప్రయోజనాలు పరిగణలోకి తీసుకొని డివిజన్ బెంచ్ లో అప్పీలు చేయనుంది. కాగా హైకోర్ట్ జీవో35 ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు టాలీవుడ్కు ఊరట కలిగించింది. అయితే మళ్లీ ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లపై వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. నిన్న హైకోర్ట్ పాత విధాానంలోనే థియేటర్ల యజమానులు టికెట్ ధరలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో రానున్న బడా సినిమాలు భీమ్లానాయక్, పుష్ఫ, ట్రిపుల్ ఆర్ లకు అడ్డంకులు తొలిగిపోయాయి.

అయితే గత కొంత కాలంగా ఏపీ ప్రభుత్వానికి… టాలీవుడ్ కు మధ్య ప్రచ్ఛన్న యుద్దం నడుస్తోంది. టికెట్ ధరలపై పాత విధానాన్నే కొనసాగించాలని టాలీవుడ్ ప్రముఖులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. టికెట్ ధరలపై ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. పవన్ కళ్యాన్ టికెట్ ధరలపై నేరుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచిచూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news