పాదాలపై చెప్పుల గుర్తులు కనిపిస్తున్నాయా..? ఇలా తొలగించండి

-

అందంగా ఉండంటం అంటే.. ముఖం ఒక్కటి మెరిసిపోతూ ఉంటే చాలదు. పాదాలు కూడా బాగుండాలి కదా.. కానీ చాలామంది.. ఫేస్, మెడ,మోచేతులూ అంటే.. ఇక్కడే చూస్తారు కానీ.. కాళ్లు పట్టించుకోరు. చెప్పులు వేసుకోవడం వల్ల పాదాలపై మచ్చలు ఏర్పడతాయి. వాటిని అస్సలు సమస్యగా కూడా చూడరు. కానీ అవి మరీ ఎక్కువగా ఉంటే అప్పుడు అరే ఏంటి ఈ మచ్చలు అని ఇబ్బందిగా ఫీల్ అయి సాక్సులు వాడటమో ఇంకేదో చేస్తారు. ఈరోజు మనం ఈ మచ్చలు పోవడానికి సింపుల్ హోమ్ రెమిడీస్ ఏంటో చూద్దాం.

కలబందను పాదాలకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. అంతేకాదు రెండు టేబుల్ స్పూన్ల తాజా అలోవెరా జెల్‌ను కొన్ని చుక్కల బాదం నూనెతో కలిపి పాదాలకి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే పాదాలు భలే మెరిసిపోతాయి.

రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుని అందులో పెరుగు లేదా పాలు కలిపి పేస్ట్ లా చేసుకోండి. ఇది పాదాలకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత పాదాలను కడగాలి. రెండు చెంచాల పసుపు, కొద్దిగా చల్లటి పాలు తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ప్రభావిత ప్రాంతంలో దీన్ని అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి.

ఒక చెంచా ఆలివ్ నూనెలో రెండు చెంచాల పసుపు పొడిని కలపండి. పేస్ట్‌లా చేసి పాదాలకు అప్లై చేయండి. తర్వాత 10 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే పాదాలు మెరుస్తాయి.

1 టేబుల్ స్పూన్ గంధపు పొడిని తీసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్, నిమ్మకాయ రసం కలపాలి. దానిని పాదాలకి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఒక టేబుల్ స్పూన్ బాదం పొడి, గంధపు పొడి, రోజ్ వాటర్ లేదా పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీనిని పాదాలకి అప్లై అరగంట పాటు ఉంచుకుని.. రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి.

ఈ చిట్కాల్లో మీకు వీలైనది ఏదో ఒకటి తరచూ చేస్తూ ఉంటే.. పాదాలపై మచ్చలు పోయి అందంగా మెరిసిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news