ఫోన్ కు చార్జింగ్ పెట్టి ఫోన్ ను వాడుతున్నారా?

-

ఇప్పుడు మనుషుల కంటే ఫోన్లకే ఎక్కువ విలువ ఉంటుంది.. చూస్తున్న సంఘటనలు అలా ఉన్నాయి మరి.దాంతో మనుషుల తో కన్నా చాలా మంది ఫోన్లతోనే ఎక్కువ గడిపేస్తున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే ఫోన్ ను చూసి తిండి, నిద్రను కూడా మానేశారు..మరి అలాంటి ఫోన్​ను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఫోన్​కు ప్రాణం పోసేది ఛార్జింగే కదా. కాబట్టి అలాంటి ఛార్జింగ్​ విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరని చెప్పాలి. ఇలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి..

అవి చాలా ముఖ్యమైనవి.. ఎంత అంటే ఫోన్ బ్లాస్ట్ అవ్వకుండా.. ఎక్కువ రోజులు వచ్చేందుకు సహాయం చేస్తాయి.అందుకోసం చార్జింగ్ పెట్టే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం…

అందులో ఛార్జింగ్ పెట్టి ఫోన్​ను ఉపయోగించడం అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య. ఛార్జింగ్​ పెట్టి ఫోన్​ను వాడితే మొబైల్ వేడెక్కుతుంది. ఈ ఒత్తిడి ఫోన్​ బ్యాటరీ, స్క్రీన్, ప్రాసెసర్ మీద పడుతుంది. అప్పుడు ఫోన్​ స్లో అవ్వడం, వేడెక్కడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఫోన్​లో ఛార్జింగ్ మొత్తం పూర్తయ్యేవరకు వాడకపోవడం మంచిది. కొన్నిసార్లు ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడటం వల్ల అవి పేలిపోయే అవకాశాలు సైతం ఉన్నాయి. ఎందుకంటే ఫోన్​కు పవర్ సప్లై అనేది రెండు దిశలలో జరుగుతుంది. దీని వల్ల ఎక్కువ ఒత్తిడి జరిగి పేలిపోయే ప్రమాదాలున్నాయి.. చూసారుగా ఫోన్ బాగుండాలి.. మనం బాగుండాలి అంటే దూరంగా ఉండటమే బెస్ట్..

ఇకపోతే పోర్టబుల్ ఛార్జర్‌లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. నాణ్యమైన దానిని ఉపయోగించకుంటే అవి కూడా ఫోన్‌కు హాని కలిగిస్తాయి. మంచి బ్రాండ్‌లు, భద్రత ఉన్న ఛార్జర్లనే ఉపయోగించాలి. ప్లగ్-ఇన్ ఛార్జర్‌ల లాగానే యాపిల్ ప్రోడక్ట్స్ కాకుండా వేరేవి ఉపయోగించాలనుకుంటే యాపిల్ ఎఎఫ్​ఐ ధృవీకరణ ఉందో లేదో చూసుకొని తీసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్​లకు ఉపయోగించే సీ-పిన్​ ఛార్జర్లను యూఎస్​బీ-ఐఎఫ్​ ధృవీకరించిందో లేదో చూసుకోవాలి… ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news