NTR 30 కోసం చాలా ఆత్రుత గా ఎదురు చూస్తున్న జాన్వీ.!

-

జూ ఎన్టీఆర్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.  రాజ మౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో తన నటన తో  భారత దేశంలో లోనే కాక ,హాలీవుడ్ వాళ్ళను సైతం ఆశ్చర్యపరిచాడు.కాని జూ ఎన్టీఆర్ తర్వాత సినిమా గురించి అప్డేట్ లేక ఫ్యాన్స్ చాలా నిరుస్తాహం గా వున్నారు. తాను చేయబోయే చిత్రం 30 వది కావడంతో నందమూరి అభిమానులే కాదు, టాలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు చూస్తున్నారు.ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించిన సెట్‌ వర్క్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. శంషాబాద్‌లో ప్రాంతంలో ఓ సెట్‌ వేస్తున్నారట. అయితే సినిమా షూటింగ్‌ ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభమవుతుందనే టాక్‌ ఆ మధ్య వినిపించింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచిగానీ, లేదంటే మార్చి మొదటి వారం నుంచి గానీ చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉందని చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం. భారీ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేసినట్టు టాక్.

ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా కన్ఫర్మ్ అయిపొయింది. రీసెంట్ గా ఆమె ఈ ప్రాజెక్ట్‌పై సంతకం చేసిందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన మాత్రమే ఇప్పుడు రావాల్సి ఉంది. ఈ సినిమా కోసం , జాన్వీ చాలా ఆత్రుత గా ఉంది. కొరటాల శివ తన కోసం సూపర్ పాత్ర ను డిజైన్ చేశారట. బల్క్  డేట్స్ కూడా ఈ సినిమాకి ఎక్కువ కేటాయించిందని చెబుతున్నారు. ఈ చిత్రం జాన్వీకి తొలి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అవుతుంది. అందుకే ఈ సినిమా కోసం జాన్వీ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉందట.

 

Read more RELATED
Recommended to you

Latest news