టీ తాగడం అలవాటు ఉన్నవాల్లకు ఎక్కడున్నా,ఎలా ఉన్నా టైం కు కాస్త గొంతులో పడకుంటే మాత్రం ఇది అయిపోతారు. అదో వ్యసనంలాగా వాళ్ళు భావిస్తారు. అయితే ఇంట్లో కాకుండా బయట తాగే వాళ్ళు మాత్రం కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని తాగితే మంచిది.. లేకుంటే మాత్రమే రోగాల బారిన పడినట్లే..మరీ ముఖ్యంగా రైల్లో ప్రయాణం చేసేవాల్లు..రైళ్లల్లో, రైల్వే స్టేషన్ లలో స్నాక్స్, టీ, కాఫీలు అమ్మడం చాలా కామన్..
ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారు ఇక ఏమి లేక వాటిని కొనుగోలు చేస్తారు.అయితే కొంత మంది మాత్రం రైళ్లల్లో అమ్మే ఆహార పదార్థాలను తినలకే ఇంటి నుంచే తెచ్చుకుంటుంటారు. స్నాక్స్ విషయంలో ఓకే కానీ.. టీ, కాఫీ విషయంలో అలా కుదరదు. తాగాలనే కోరిక ఉంటే కచ్చితంగా రైల్లో కొనుగోలు చేయాల్సిందే. ఇక ఆ టీ, కాఫీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఈ విషయం తెలిస్తే మాత్రం మీరు ఇక నుంచి రైళ్లల్లో టీ గానీ, కాఫీ గాని తాగాలంటేనే భయంతో వణికిపోతారు. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
ట్రైన్‌లో టీ అమ్మే వ్యక్తి టీని ఎలా వేడి చేస్తున్నాడో ఇద్దరు ప్రయాణకులు వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యక్తి టీని వేడి చేయడం కోసం శుభ్రంగా లేని ఒక హీటర్‌ని ఉపయోగించాడు. అతను టీని వేడి చేసే విధానం చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా ఉంది. ఈ ఘటన శబరి ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. పలువురు ప్రయాణికులు శబరి ఎక్స్‌ప్రెస్‌లో విక్రయించే ఆహర పానీయాలు చాలా ఘోరంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మాత్రం ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram