ఆన్‌లైన్‌లో ఈ ఫుడ్స్‌ ఆర్డర్‌ చేస్తున్నారా..? జర పైలం !!

-

ఇంతకు ముందు లేకపోతే.. ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోని తినేవాళ్లు. కానీ ఇప్పుడు మూడ్‌ లేకపోయినా వంట చేయడం మానేసి.. ఏదో ఒకటి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకుంటున్నారు. మనకు ఎలాంటి ఆహారం కావాలన్నా.. ఆన్‌లైన్‌లో రెడీగా ఉంటోంది. కానీ కొన్ని ఆహారాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకోకూకడదట. అవి తినకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. అందులో మీరు రెగ్యులర్‌గా ఆర్డర్‌ చేసేవే ఎక్కువగా ఉన్నాయి..!

ఫ్రెంచ్ ఫ్రైలను ఇష్టపడని వాళ్లు ఉండరు కదా..! వీటిని చాలా మంది ఆర్డర్‌ చేసుకుని తింటుంటారు. అయితే ఆన్‌లైన్‌లో తీసుకురాకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది చేసిన తర్వాత టైం ఎక్కువైతే పాడై పోతుంటాయట. చిప్స్, నాచోలకు కూడా అదే జరుగుతుంది. కానీ కాలక్రమేణా అది కూడా పాడైపోతుంటాయి.

ఐస్ క్రీం ఎంత త్వరగా తెచ్చినా అది కాస్త కరిగిపోతుంది. శీతాకాలంతోపాటు వేసవిలోనూ ఇదే సమస్య రావచ్చు. స్మూతీస్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే స్మూతీ కాలక్రమేణా వేడెక్కుతుంది.

మీరు ఆన్‌లైన్‌లో కాల్చిన శాండ్‌విచ్‌లను ఆర్డర్ చేయకండి. కాలక్రమేణా అది అలాగే ఉండదట. ఇలాంటివి కూడా పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీరు గ్రేవీ, నూడుల్స్ వేర్వేరు కంటైనర్లలో తీసుకువస్తే, అది మంచిది. కానీ ఆర్డర్ చేసిన వస్తువులను అదే పాత్రలో తెచ్చుకుంటే గ్రేవీ నూడుల్స్ రుచి మారిపోతుంది.

హైలెట్‌ ఏంటంటే.. ఇవి ఆన్‌లైన్‌లోనే కాదు.. ఆఫ్‌లైన్‌లో కూడా ఎక్కువగా తినకూడని ఆహారాలు. ఇలాంటి ఆహారాలు మీ జీవనశైలిని ఘోరంగా దెబ్బతీస్తాయి. ఊబకాయానికి దారితీస్తాయి. బరువు ఎప్పుడైతే పెరుగుతారో.. అప్పుడే రోగాలు రావడం స్టాట్‌ అవుతుంది. దీర్ఘకాలిక రోగాలు అయినా బీపీ, షుగర్, థైరాయిడ్‌ లాంటివి ఒక్కసారి వచ్చాయంటే.. ఆ తర్వాత మీరు జీవితాంతం ఇలాంటి ఆహారాలను మానేయాల్సి ఉంటుంది కాబట్టి.. ఏం తిన్నా కంట్రోల్‌గా తినాలి. అతిగా తింటే అనర్థమే జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news