ప్రముఖ సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ చేయాలంటే గేట్ ఎగ్జామ్ ను రాయాలి.ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఐఐటీలతో పాటు ఐఐఎస్‌సీ బెంగళూరు, ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.. ఈ గేట్ స్కోర్ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తాయి.. అయితే అత్యంత కఠినమైన పరీక్షలలో ఇది కూడా ఒకటి..ఇందులో స్కోర్ రావాలంటే చాలా కష్టపడాలి.. కొన్ని టిప్స్ ఫాలో అయితే మంచి స్కోర్ ను పొందవచ్చునని నిపుణులు అంటున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం..
ప్రీవియస్ పేపర్స్‌ను అభ్యర్థులు కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. దీంతో ఎగ్జామ్‌లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే అంశంపై స్పష్టత వస్తుంది. అభ్యర్థులు తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌పై పూర్తి అవగాహన అవసరం. ప్రతి సబ్జెక్టు వెయిటేజీని తెలుసుకొని, దాని ప్రకారం ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవ్వాలి. ప్రతి ఒక్క పేపర్‌లో సబ్జెక్ట్‌లు, టాపిక్‌లు ఉంటాయి. వీటికి ఇతర పేపర్‌లతో పోల్చినప్పుడు వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సబ్జెక్టులపై అభ్యర్థులు ఎక్కువగా దృష్టి పెట్టాలి..
వీక్ గా ఉన్న సబ్జెక్ట్ లపై ఫోకస్ పెట్టాలి.. ఆ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. అన్ని అంశాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.. గేట్ ఎగ్జామ్‌లో ఎక్కువగా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు వేగం, కచ్చితత్వం అవసరం. ఎక్కువ సంఖ్యలో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి..
ఇకపోతే ఏ ఎగ్జామ్‌లో అయినా మంచి స్కోర్ సాధించాలంటే టైమ్ మేనేజ్‌మెంట్ కీలకం. ప్రశ్నకు సమాధానాలు గుర్తించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటే.. మిగతా ప్రశ్నలను చదివే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అన్ని ప్రశ్నలకు వీలైనంత తక్కువ సమయం కేటాయించేలా చూసుకోవాలి..
గేట్ ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు ఏకాగ్రతతో ఉండాలి. చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. సోషల్ మీడియా, టీవీ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. వ్యాయామం, పోషకాహారం, సరిపడా నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగించడం చాలా ముఖ్యమని గుర్తించాలి.. దేనికైనా రెడీగా ఉండాలి..