తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తున్నారు. కాళోజీ వాక్కులతో గవర్నర్ ప్రసంగం ప్రారంభించారు. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అని కాళోజీ అన్నారు’ అంటూ తమిళిసై తన ప్రసంగం షురూ చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత గవర్నర్ ప్రసంగిస్తున్నారు.
‘తెలంగాణ.. దేశానికి ఆదర్శంగా మారింది. ప్రజల ఆశీర్వాదాలు.. సీఎం నైపుణ్య పాలనతో రాష్ట్రాభివృద్ధి. ప్రజాప్రతినిధుల కృషి.. ఉద్యోగుల నిబద్ధత రాష్ట్ర ప్రగతికి కారణం. ఒకప్పుడు తెలంగాణలో విద్యుత్ కోతలు ఉండేవి. తెలంగాణలో ప్రస్తుతం నిరంతర విద్యుత్ అందిస్తున్నాం. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది. ఇంటింటికీ సురక్షిత జలాలు అందిస్తున్నాం. రాష్ట్ర పల్లెల రూపురేఖలు మారిపోయాయి. అత్యున్నత ప్రమాణాలతో గ్రామాలు ఆదర్శంగా మారాయి.’ అని గవర్నర్ అన్నారు.