చాలామందికి నిద్రలేవగానే కళ్లు కింద ఉబ్బిపోయినట్లు ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత మెల్లగా నార్మల్ పొజిషన్‌కు వస్తాయి.. దాంతో ఇది సమస్య కాదులే అనకుంటారు. కళ్లు కింద ఉబ్బిపోయినట్లు ఉంటుంది అంటే.. మీలో ఏదో సమస్య ఉందనే అర్థం.. కొన్నిరోజులకు అది శాశ్వతంగా కనిపిస్తుంది. ఇలా ఉబ్బడానికి కారణాలు చాలా ఉంటాయి.. కొలెస్ట్రాల్, థైరాయిడ్, షుగర్ వీటిల్లో ఏదైనా కావొచ్చు.. అయితే ఇలా ఉబ్బినకళ్లు చూడ్డానికి ఏం బాగుండవు.. ఇలా కళ్లు ఉబ్బటానికి కారణాలు ఏమై ఉంటాయి… వీటి నుంచి ఎలా బయటపడాలో ఈరోజు చూద్దాం..
కళ్ళ కింద వాపు ఎందుకు వస్తుంది?
చాలా సార్లు మీ కళ్ల కింద ద్రవం పేరుకుపోవడం వల్ల కంటి కింద ఉబ్బినట్లు కనిపిస్తుంది.
డీహైడ్రేషన్ కారణంగా కూడా కంటి సమస్యలు వస్తాయి.
అధిక మొత్తంలో ధూమపానం, ఆల్కహాల్ తీసుకుంటే కూడా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తాయి.
సరిగ్గా నిద్రపోకపోతే, అలసిపోవడం కారణంగా కూడా కళ్ళు వాపు ప్రారంభమవుతాయి.
మీరు అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు వినియోగించడం వల్ల కూడా వాపుకు గురవుతారు.
పెరుగుతున్న వయస్సుతో కారణంగా కూడా కళ్ళ క్రింద వాపు చాలా సాధారణం..
కళ్ల ఉబ్బరాన్ని తగ్గించడానికి బాదం నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. బాదం నూనెలో అనేక అద్భుతమైన ఔషధ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని కళ్ళకు మసాజ్ చేయడం వల్ల వాపు సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా కళ్ళ నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. కంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బాదం నూనె కళ్లకు అప్లై చేయండి.
బాదం నూనెను ఎలా ఉపయోగించాలంటే..
ముందుగా ఒక స్పూన్ బాదం నూనెను తీసుకోండి.
ఆ తర్వాత ఈ నూనెను రెండు కళ్ల కింద అప్లై చేయండి.
దీని తర్వాత కాసేపు తేలికగా రెండు వేళ్లతో మసాజ్ చేయండి.
మీ కళ్ళ క్రింద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో కళ్ల కింద వాపు తగ్గుతుంది.
ఇలా ప్రతి రోజూ కళ్ల కింద అప్లై చేస్తే త్వరలోనే మంచి ఫలితం పొందుతారు.
వీటితో పాటు.. డైలీ లేవగానే ఒక ఐస్ క్యూబ్‌ను క్లాత్‌లో వేసుకుని కళ్లకింద పైనా మసాజ్ చేయండి. అలాగే.. మీరు వ్యాయమం చేసే వాళ్లైతే.. వ్యాయమం చేసేప్పుడు మీ రెండు చేతులను ముఖం మీద పెట్టుకుని.. రెండు ఫింగర్స్‌ను కళ్ల కింద పెట్టి చెవి వరకూ మెల్లగా లాగండి.. ఇలా రెండు మూడు సార్లు రిపీట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ కల్ల కింద పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బ్లడ్ సర్కులేట్ అవుతుంది. డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం.. కూడా రక్తప్రసరణ జరగకపోవడమే.!