లవ్, ఎమోషనల్ ఎంటర్ టైనర్ “దోస్తాన్” మూవీ

-

 

లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన తాజా సినిమా దోస్తాన్. సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “.ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై వచ్చిన ఈ సినిమా ఇవాళ గ్రాండ్ గా రిలీజ్ అయింది.

 

కథ

వైజాగ్ సిటీలో భాయ్ (చంద్రసే గౌడ) అనే వ్యక్తి డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ వంటి అక్రమ బిజీనెస్ లు చేస్తూ చలామణి అవుతుంటాడు. అతను గతంలో చెట్టు కింద పాలిస్తున్న నిస్సహాయరాలైన ఓ తల్లిని తన గ్యాంగ్ తో రేప్ చేసి చంపేస్తాడు. అక్కడే ఉన్న మరో అనాద జై (కార్తికేయ) ఆ చంటి బిడ్డ ఏడుపు వినిపించి చూడగా అక్కడ ఆ పిల్లాడి తల్లి చనిపోయి ఉంటుంది.. తన లాగే అనాధగా ఉన్న పిల్లాడిని చేరదీస్తాడు. ఏడుస్తున్న పిల్లాడి పాలకోసం వీధిలో ఆడుక్కంటున్న జై ను చూసి మెకానిక్ సెడ్ ఓనర్ అయిన బాబా (రమణ మహర్షి ) చేరదీసి షెడ్లో మెకానిక్ పని నేర్చుకోమని చెపుతాడు. అలాగే పెద్దోడికి జై( కార్తికేయ ), చిన్నోడికి రామ్ (సిద్ స్వరూప్) గా నామకారణం చేస్తాడు. వీరు పెద్ద అయిన తరువాత ఆ పెద్దాయన చనిపోవడంతో జై ను చదువుకోమని చెప్పి రామ్ మెకానిక్ గా మారతాడు. ఈ క్రమంలో జై కు నిత్య (ప్రియ వల్లబి) పరిచయం అవ్వగా, రామ్ (సిద్ స్వరూప్) కు రియా (ఇందు ప్రియ) పరిచయం ఆవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇలా వీరి లైఫ్ హ్యాపీ గా సాగిపోతున్న వీరి జీవితంలోకి మళ్ళీ భాయ్ ప్రవేశిస్తాడు. ఆ భాయ్ వల్ల జై, రామ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరికి భాయ్ పై వీరిద్దరూ ఎలాంటి రివేంజ్ తీర్చుకొన్నారు? అనేది తెలుసుకోవాలంటే “దోస్తాన్” సినిమా చూడాల్సిందే..

 

 

 

*నటీ నటుల పనితీరు*

జై పాత్రలో కార్తికేయ , రామ్ పాత్రలో సిద్ స్వరూప్ లు హీరోగా నటించిన వీరిద్దరూ కొత్త వారైనా ఎమోషన్, లవ్, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్ని రకాలుగా చక్కటి పెర్ఫార్మన్స్ చూపిస్తూ త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. హీరోయిన్స్ గా నటించిన నిత్య, రియా పాత్రలలో నటించిన ఇందు ప్రియ, ప్రియ వల్లబి తమ లిద్దరూ గ్లామర్స్ లుక్స్ తోపాటు నటనపరంగా బాగా నటించారు. ఇందులో వీరిద్దరి జోడీలు చాలా క్యూట్ గా ఉన్నాయి .  బాయ్ పాత్రలో నటించిన చంద్రసే గౌడ నెగటివ్‌ షేడ్‌ పాత్రలో ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. నిత్య తండ్రి పాత్రలో నటించిన మూస ఆలీ ఖాన్ తో పాటు ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

 

 

పాజిటివ్ పాయింట్స్

 

కథ

నటి,నటుల ప్రదర్శన

లవ్ సీన్స్

కామెడీ

మ్యూజిక్

 

రేటింగ్ : 3/5

Read more RELATED
Recommended to you

Latest news