ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారా..? ఎన్ని నష్టాలో తెలిస్తే.. సెల్ఫీలు తీసుకోరు..!

-

ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఫుడ్ తినడానికి వెళ్ళినా లేదంటే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినా సెల్ఫీలు ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా సెల్ఫీలు ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారా..? ఈ నష్టాలు కనుక చూసారంటే సెల్ఫీలు తీసుకోవడం మానేస్తారు. ఈ మధ్య ప్రతి ఒక్కరికి సెల్ఫీల పిచ్చి పట్టింది ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు.

అదే పనిగా సెల్ఫీలు తీసుకుంటే మానసిక శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక సెల్ఫీల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది చూద్దాం. సెల్ఫీలను తీసుకోవడానికి మనం మన మోచెయ్యిని వంచుతూ ఉండాలి ఇలా చేయడం వలన మోచేతి మీద ఒత్తిడి పడుతుంది. దీంతో సెల్ఫీ ఎల్బో వచ్చే ప్రమాదం ఉంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సెల్ఫీలు తీసుకునే వాళ్ళలో మానసిక సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయట.

సెల్ఫీలు తీసుకుని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. లైక్లు, కామెంట్లు వంటివి ఎక్కువగా రాకపోతే వాళ్లలో మానసిక సమస్యలు కనబడతాయి. సెల్ఫీ స్టిక్ తో సెల్ఫీలు తీసుకునే వాళ్ళల్లో మోచేతి వాపు వచ్చే ప్రమాదం ఉంది. కండరాలపై ఒత్తిడి కూడా కలగొచ్చు. కాబట్టి సెల్ఫీలు ని ఎక్కువగా తీసుకోవద్దు. సెల్ఫీలను ఎక్కువగా తీసుకోవడం వలన ఆత్మ విశ్వాసం తగ్గుతుంది. రోజులో మూడు సార్లు సెల్ఫీలు తీసుకుంటే ఈ సమస్య రెట్టింపు అవుతుంది.

అలానే సెల్ఫీలను ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో వాళ్ళు అందంగా లేవేమో అనే భావన వారిలో కలుగుతుంది. అలానే ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లి సెల్ఫీలు తీసుకోండి చాలామంది ప్రాణాలని కోల్పోయారు. సెల్ఫీలు ఎక్కువగా తీసుకుంటే రేడియేషన్ ప్రభావం కూడా పడుతుంది చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి. అంతే కాక ఒత్తిడి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సెల్ఫీలు ని ఎక్కువగా తీసుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news